ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్‌ నిరసన

09-10-2026 | 08:03pm

భిక్కనూర్, అక్టోబర్‌ 9 (విజయ క్రాంతి): ఓట్ల తొలగింపును(Deletion of votes) నిరసిస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను(Chief Election Commissioner Gyanesh Kumar) పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ భిక్కనూర్‌ మండల కాంగ్రెస్‌(Bhikkanoor Mandal Congress) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాగనగర్‌ నరేందర్‌రెడ్డి(Naganagar Narender Reddy), జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సుదర్శన్‌, సర్పంచ్‌ బల్యాల రేఖా సుదర్శన్‌, తిప్పాపూర్‌ సర్పంచ్‌ లింగారెడ్డి, సింగిల్‌ విండో అధ్యక్షుడు గంగల భూమయ్య, మైపాల్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, మద్దూర్‌ రవి, చామర్తి రాజు, జాగల కిరణ్‌, సురేందర్‌రెడ్డి, గూడెం కాల్‌రెడ్డి, సంతోష్‌గౌడ్‌, నాగి రమేష్‌, నాగనగర్‌ మల్లారెడ్డి, సంజీవులు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు