తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు కి మాజీ ఎంపీ కృషి
బోథ్. అక్టోబర్ 13 (విజయ క్రాంతి) సనాల మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరీకి కృషి చేసిన మాజీ ఎంపీ సోయం బాబురావు(Former MP Soyam Bapu Rao) కు సోనాల మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గాజుల పోతున్న పర్సన్ వ్యక్తపరిచారు. పేద విద్యార్థుల చదలను దృష్టిలో ఉంచుకొని మాజీ ఎంపీ పాఠశాల మంజూరు కోసం తన వంతు కృషి చేయడం జరిగిందన్నారు.
ఆయన సొంత మండలమైన సోనాలలో పాఠశాల మంజూరు కోసం ముఖ్యమంత్రి వద్ద పట్టు పట్టి మంజూరు చేస్తున్నారు అన్నారు.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలను దృక్పథంతో మంజూరు కోసం ప్రయత్నాలు కొనసాగించి విజయం సాధించారన్నారు. పాఠశాల మంజూరితో మారుమూల గ్రామాల్లో ఉన్న ఆదివాసి బిడ్డల చదువులు మెరుగుపడతాయన్నారు.