రాష్ట్ర స్థాయి జూనియర్ ఖో -ఖో పోటీలకు భీమవరం విద్యార్థులు

13-10-2026 | 04:09pm

ఎర్రుపాలెం అక్టోబర్ 13 ( విజయ క్రాంతి): రాష్ట్ర స్థాయి జూనియర్ ఖో -ఖో పోటీలకు(State-level Junior Kho-Kho competition) భీమవరం విద్యార్థులు ఎంపికైనారు. ఈ నెల 11 వ తేదీన ఖమ్మం జిల్లా కల్లూరు మినీ స్టేడియం లో జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఖో -ఖో జట్టు ఎంపికలకు ఉమ్మడి జిల్లా నుంచి 70 మంది విద్యార్థినిలు పాల్గొన్నారు. ప్రతిభ కలిగిన వారిని ఖమ్మం జిల్లా జట్టుకు ఎంపిక చేసినారు.

వీరు ఈ నెల 15 తేదీ నుండి 17 తేదీ వరకు హైదరాబాద్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు ఖమ్మం జిల్లా జట్టులో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం వేమిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల.

భీమవరం విద్యార్థినిలు 5 మంది శీల తేజశ్రీ గండు రాధిక తల్లపురెడ్డి సంజన శీల శ్రావణి వేమిరెడ్డి మౌనిక ఎంపిక అయినారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్  ఉపేందర్  పి డి నరాల సాంబశివారెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు ఎంపిక అయిన చిన్నారులను భీమవరం గ్రామ సర్పంచ్ వంగల నాగేశ్వరరావు అభినందించారు.

మరిన్ని వార్తలు