వేదం పాఠశాల విద్యార్థులతో తల్లిదండ్రుల సమావేశం
విద్యాబోధనపై విద్యార్థుల తల్లిదండ్రుల ఆరా..
బోథ్ నవంబర్ 1 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని వేదం పాఠశాల(Vedam School) ప్రిన్సిపాల్ పచ్చిపాల సంతోష్ తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వసతులను కొనసాగుతున్న విద్యాభ్యానపైన తల్లిదండ్రులతో సమావేశాన్ని నిర్వహించారు. తరగతి గదిలో విద్యార్థుల తల్లిదండ్రులను ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులు కూర్చొని సమీక్ష నిర్వహించారు. పాఠశాలలో విద్య బోధన ఏ విధంగా సాగుతుంది అనే విషయాన్ని ఉపాధ్యాయుల ముందే విద్యార్థులను అడిగారు.
విద్యార్థులు పాఠశాలలో కొనసాగుతున్న విద్యా బోధనపై తల్లిదండ్రులకు వివరించారు. సరియైన రీతిలో విద్య బోధన సాగుతుందా లేదా అనే విషయాన్ని తల్లిదండ్రులు ఆరా తీశారు. తమ పిల్లలు చదువుల్లో వెనకంజలో ఉంటే అందుకు కారణాలు ఏమిటనేది ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అంతేగాక పాఠశాలలో ఉన్న వసతులు ఏ విధంగా ఉన్నాయి. తరగతి గదిలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా. అనే విషయాన్ని విద్యార్థులు అడిగి తెలుసుకోవడం జరిగింది. మొదట పాఠశాలకు చేరిన తల్లిదండ్రులను ఉపాధ్యాయులు సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం తరగతి గదిలో కూర్చొని హాజరు శాతాన్ని మార్పుల జాబితాను పరిశీలించారు. విద్యార్థులు చదువుల్లో వెనుకంజలో ఉండడానికి గల కారణాలను ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరించారు. వినూత్న రీతిలో ప్రిన్సిపాల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల కొత్త ఒరవడి సృష్టించినట్లు అయిందని పలువురు పేర్కొంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సైతం ఉపాధ్యాయుల బోధనపట్ల సంతృప్త వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు ఏదైనా ఇబ్బంది పడితే తమకు సమాచారం ఇవ్వాలని లేకుంటే తల్లిదండ్రుల ద్వారా సమాచారం ఇవ్వాలని కోరారు.