మండలంలో మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ పర్యటన
సింగరేణి నవంబర్ 1 (విజయక్రాంతి): వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్(Former MLA Ramulu Naik) ఆదివారం సింగరేణి మండలంలో విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా ఉసిరికాయలపల్లిలోని కోటమైసమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకొగా, ఆలయ చైర్మన్ పర్స పట్టాభిరామారావు ఆయనను శాలువాతో సత్కరించారు.
అర్చకులు కైలాస శర్మ కుమారుడు శంకర్ శర్మ, శరణ్య నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం మండల కేంద్రంలో ఉపాధ్యాయుడు కేలోత్ నరేష్ నూతన గృహప్రవేశానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలతో ముచ్చటించారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు అజ్మీర వీరన్న, జాల సాంబ, రాంజీ, రాంకిషోర్, శ్యామ్ లాల్, ప్రతాప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.