దాసరి రాజు కుటుంబాన్ని పరామర్శించిన మధుసూదనాచారి
30-09-2026 | 05:19pm
గణపురం, సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి): గణపురం మండలంలోని గొల్లపల్లి గ్రామంలో ఇటీవల విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన దాసరి రాజు కుటుంబాన్ని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి(Sirikonda Madhusudhanachary) బుధవారం పరామర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కోలా రవి గౌడ్ మేకల రజిత ,కర్రే ప్రవీణ్, బండారి కిరణ్,అల్లూరి శ్రీను,అనిల్ , ఓంకార తిరుపతి, శ్రీకాంత్,రాజమల్లు,సందీప్, తదితరులు ఉన్నారు.