అర్నాబ్ తుఫాన్ బాధితులకు అండగా ఉంటాం

25-09-2026 | 06:18pm

యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టండి

అండగా ఉంటాం.. అధైర్యపడకండి

కొత్తగూడెం శాసనసభసభ్యులు కూనంనేని సాంబశివరావు

పాల్వంచ, సెప్టెంబర్ 25 :(విజయక్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షాలు(Heavy rains), తుఫాను బీభత్సానికి తీవ్రంగా దెబ్బతిన్న మండల పరిధిలోని దంతాలబోరే ఎస్ కాలనీ గ్రామాన్ని స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు(Koonamneni Sambasiva Rao) శుక్రవారం అధికారులతో కలిసి స్వయంగా సందర్శించారు. గ్రామంలో పర్యటించి అర్నాబ్ తుఫాను(Cyclone Arnab) సృష్టించిన నష్టాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో కూలిపోయిన ఇళ్లను అయిన పరిశీలించారు. సర్వస్వం కోల్పోయిన బాధితులను కలిసి వారిని ఓదార్చారు.

అన్ని విధాలా అండగా ఉంటామని అధైర్యపడవద్దని వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్థులు తమకు జరిగిన ఆస్తి నష్టం,  విద్యుత్ లేక పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే కూనంనేని వెంటనే గ్రామంలో నిలిచిపోయిన విద్యుత్‌ను పునరుద్ధరించడానికి తక్షణ చర్యలు చేపట్టాలని, వైద్య శిబిరం ఏర్పాటు(Medical camp organized) చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇళ్లు దెబ్బతిన్న పేదలకు ప్రభుత్వ నియమావళి ప్రకారం నష్టపరిహారం అందేలా త్వరగా నివేదికలు తయారు చేయాలని రెవెన్యూ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గ్రామానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తామని గ్రామస్థులకు మాట ఇచ్చారు. ఎమ్మెల్యే కూనంనేని వెంట సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా, తహసిల్దార్ దారా ప్రసాద్ ఎం.పి.డి.ఓ.రాజారావు శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు