బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సీఐటీయూ మద్దతు

27-09-2026 | 02:23pm

ఇల్లెందు టౌన్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగులు చేపట్టే మూడు రోజుల సమ్మె(Bank Employees Strike)కు సీఐటీయూ(CITU) మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగా ఆదివారం ఇల్లెందులోని ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, జిల్లా సహకార బ్యాంకుల్లో ఉద్యోగులకు మద్దతు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ మాట్లాడుతూ వారానికి ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని, పీఎల్‌ఐలో ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ 12వ వేతన ఒప్పందంలోని మిగిలిన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు.

మరిన్ని వార్తలు