పీఆర్టీయూ టీఎస్ అధ్యక్షులుగా యన్ రెడ్డి మహేశ్వర్
ప్రధాన కార్యదర్శి గాదె కోటేశ్వరరావు
సుల్తానాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ సుల్తానాబాద్ మండల శాఖ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సుల్తానాబాద్ పట్టణం(Sultanabad Mandal)లోని మండల ప్రజా పరిషత్ బాలుర పాఠశాలలో మండల శాఖ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. 2026, 2028 సంవత్సరానికి సంబంధించి నూతన కార్యవర్గ ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు.
సభ్యుల ఏకాభిప్రాయంతో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల శాఖ అధ్యక్షుడిగా ఎన్రెడ్డి మహేశ్వర్, ప్రధాన కార్యదర్శిగా గాదె కోటేశ్వర్రావు, అసోసియేట్ అధ్యక్షుడిగా పి.ఎల్లయ్య, మహిళా అసోసియేట్ అధ్యక్షురాలిగా ఎన్. ఆశాలత, ఉపాధ్యక్షుడిగా శివశరణం, మహిళా ఉపాధ్యక్షురాలిగా శెట్టి ప్రసన్నరాణి, కార్యదర్శిగా ఉమాశంకర్, మహిళా కార్యదర్శిగా సమత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎన్నికల అధికారిగా ఎలిగేడు మండల శాఖ అధ్యక్షుడు మిట్టపల్లి యుగంధర్ వ్యవహరించి ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. కార్యవర్గ ఎన్నిక అనంతరం సభ్యులు నూతన బాధ్యులను అభినందించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతోపాటు, సంఘాన్ని మరింత బలోపేతం చేసే దిశగా నూతన కార్యవర్గం సమన్వయంతో పనిచేయాలని పలువురు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు గండు కృష్ణమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి కానుగంటి శ్రీనివాస్ హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని, ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణకు సంఘం తరఫున నిరంతరం పోరాడాలనిసూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర బాధ్యులు పెద్దపల్లి లచ్చయ్య, పిట్టల రవీందర్, జిల్లా బాధ్యులు దూడం సురేష్, రాజేంద్రప్రసాద్, వెంకట మాధవరావు, పల్లెర్ల సురేందర్ తో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.