డీజే మోతకు పైకప్పు షేక్.. వీడియో వైరల్..!
తెలంగాణలో వినాయక నిమజ్జనం వేడుకల్లో డీజే సౌండ్(DJ sound) ఓ కుటుంబానికి షాక్ ఇచ్చింది. మెదక్ జిల్లా రామాయంపేట(Ramayampet)లో నిమజ్జనం సందర్భంగా భారీ శబ్దంతో డీజే పెట్టి తెల్లవారుజాము వరకు యువత డ్యాన్స్ చేశారు.అయితే ఆ డీజే సౌండ్ ధాటికి పక్కనే ఉన్న ఓ ఇంటి పైకప్పు పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడ్డాయి.
ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఓ మహిళపై పెచ్చులు పడటంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దీంతో వేడుకల సందడి కాస్తా.. ఆ కుటుంబంలో ఆందోళనకు దారితీసింది. భారీ శబ్దాలతో డీజేలు పెట్టడం వల్ల ఇళ్లకు నష్టం వాటిల్లే పరిస్థితులు రావడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డీజే సౌండ్‌కి ఊడిపడ్డ ఇంటి పైకప్పు పెచ్చులు
— PulseNewsBreaking (@pulsenewsbreak) September 27, 2026
మెదక్ జిల్లాలోని రామాయంపేటలో వెలుగు చూసిన ఘటన
వినాయక నిమజ్జనం సందర్భంగా.. పెద్దఎత్తున డీజే సౌండ్ పెట్టి తెల్లవారుజాము వరకు డ్యాన్స్ చేసిన భక్తులు
ఆ శబ్దానికి పక్కనే ఉన్న ఇంటి పైకప్పు పెచ్చులు ఊడిపడ్డ వైనం
ఆ సమయంలో ఇంట్లో ఉన్న మహిళపై… pic.twitter.com/7e7LrbAejb