రాంలీలా మైదానంలో కాంగ్రెస్ గర్జన
పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య
ఇల్లెందు, (విజయక్రాంతి): ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, రాజ్యాంగ పరిరక్షణతో పాటు ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Congress leader Rahul Gandhi) పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి సభకు హాజరైన ఎమ్మెల్యే కనకయ్య పార్టీ పిలుపునకు సంఘీభావం తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పోరాటానికి మద్దతుగా నిలుస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.