ఇల్లెందు ఏరియాలో ఘనంగా డిపార్ట్‌మెంటల్ క్రికెట్ పోటీలు

21-09-2026 | 05:55pm

ఇల్లెందు,(విజయక్రాంతి): ఇల్లందు ఏరియా రన్స్‌ అండ్‌ గోల్స్‌ స్టేడియం(Illandu Area Runs and Goals Stadium)లో డిపార్ట్‌మెంటల్‌ క్రీడల్లో భాగంగా క్రికెట్‌ పోటీలు(cricket competitions) సోమవారం ప్రారంభమయ్యాయి. ఏరియా జీఎం వి.కృష్ణయ్య టాస్‌ వేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం బ్యాటింగ్‌ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. డీజీఎం (పర్సనల్‌) అజ్మీర్‌ తుకారం కూడా బ్యాటింగ్‌ చేశారు.

రెండు రోజుల పాటు జరిగే పోటీల్లో భాగంగా సోమవారం కోయగూడెం ఓసీ, జీఎం ఆఫీస్‌ అండ్‌ డిపార్ట్‌మెంట్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోయగూడెం ఓసీ జట్టు విజయం సాధించింది. అనంతరం జీఎం ఆఫీస్‌, జేకేఓసీ, ఎస్‌ఎన్‌పీసీ డిపార్ట్‌మెంట్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ నిర్వహించారు. విజేత జట్లు మంగళవారం జరిగే ఫైనల్‌లో తలపడనున్నాయి. క్రీడాకారులు భద్రతా నిబంధనలు పాటిస్తూ పోటీల్లో పాల్గొనాలని జీఎం సూచించారు. కార్యక్రమంలో సీనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ జి.సుధాకర్‌, డబ్ల్యూపీఎస్‌ అండ్‌ జీఏ కోఆర్డినేటర్‌ కిషోర్‌, జనరల్‌ కెప్టెన్‌ బాబురావు, అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు