పోలీసుల దిగ్బంధనంలో జూరాల ప్రాజెక్ట్
21-09-2026 | 12:01pm
హైదరాబాద్: జూరాల ప్రాజెక్టు(Jurala Project) వద్దకు ఎవరూ వెళ్లకుండా పోలీసుల పహారా కాస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు(BRS leaders) ఇవాళ జూరాల ప్రాజెక్టు సందర్శనకు పిలుపునిచ్చారు. దీంతో బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఆత్మకూరు, అమరచింత, మదనాపురం మండలాల్లో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మాజీమంత్రి నిరంజన్ రెడ్డిని(Former Minister Niranjan Reddy) వ్యవసాయ క్షేత్రం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరంజన్ రెడ్డిని వనపర్తి ఇంటికి పోలీసులు తరలించారు.