కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దోక్కుండ్రు
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నేతల భూములు, ఫామ్‌హౌస్‌లు, పరిసరప్రాంతాలను కాంగ్రెస్ నేతలు(Congress leaders) పరిశీలిస్తున్నారు. సోమవారం నాడు బస్సులో ప్రజాభవన్ నుంచి వెళ్లిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల నిజనిర్ధారణ బృందం రంగారెడ్డి జిల్లా మద్దూరులో పర్యటిస్తోంది. మద్దూర్ లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫామ్‌హౌస్( Jagadeesh Reddy farmhouse) భూములను పరిశీలించించిన అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. ఉన్నది పేదలకు పంచి ఇవ్వాలని గతంలోని బీఆర్ఎస్ నాయకులు ఆలోచించలేదని కాంగ్రెస్ ఎంపీ సామల కిరణ్ కుమార్ రెడ్డి(Congress MP Kiran Kumar Reddy) ఆరోపించారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్(Former CM KCR's farmhouse) చుట్టూ ఉన్న 300 ఎకరాల అసైన్డ్ భూమిని పేదలకు ఎందుకు పంచి ఇవ్వలేదు?, తెలంగాణ ఉద్యమ సమయంలో లేని ఆస్తులు అధికారంలోకి వచ్చాక ఎలా వచ్చాయి?, 160/223 సర్వే నెంబర్ లో 50 ఎకరాలు ఎక్కడి నుంచి సంపాదించారు? అని ప్రశ్నించారు. బలిదానాలతో వచ్చిన తెలంగాణలో ఫామ్ హౌస్ సంస్కృతి(Telangana's Farmhouse Culture) తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు. 50 ఎకరాల్లో ఇనామ్ భూములు ఉన్నాయని సూచించారు. ఈ ఫామ్ హౌస్ లో ఇనామ్ భూములు ఉంటే పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. అటు జగదీష్ రెడ్డి వ్యవసాయ క్షేత్రం దగ్గర భారీగా పోలీసుల మోహరించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.