గడ్డిపల్లిలో సిమెంట్ బెంచీలు ఏర్పాటు
సలిగంటి సైదమ్మ జ్ఞాపకార్థం రూ.30 వేల విలువైన 10 బెంచీలు
గరిడేపల్లి, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): గడ్డిపల్లి గ్రామస్తుల సౌకర్యార్థం మండలంలోని గడ్డిపల్లి గ్రామం(Gaddipally Village)లో సలిగంటి సైదమ్మ జ్ఞాపకార్థం ఆమె కుటుంబ సభ్యులు రూ.30 వేల విలువైన 10 సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. ఆమె భర్త సలిగంటి వీరయ్య, కుమార్తె కొలిపాక అరుణ, మనవళ్లు జగదీష్, వంశీకృష్ణలు కలిసి గడ్డిపల్లి సెంటర్, బ్యాంకు, హైస్కూల్ తదితర జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో బెంచీలను ఏర్పాటు చేశారు. ప్రజలు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు విశ్రాంతి తీసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామానికి తమ వంతు సేవ చేయడంతో పాటు సైదమ్మ జ్ఞాపకాలను చిరస్థాయిగా నిలిపేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. బెంచీల ఏర్పాటుపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులను అభినందించారు.