ఉద్యమకారులకు ఘన సన్మానం

11-10-2026 | 06:08pm

మణుగూరు, అక్టోబర్ 11,(విజయక్రాంతి ): తెలంగాణ జాతిపితగా పేర్కొనే కేసీఆర్ నాయకత్వంలో(KCR's leadership) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) ఏర్పాటు జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన భద్రాద్రి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పినపాక నియోజకవర్గానికి చెందిన 40 మంది తెలంగాణ ఉద్యమకారులను(Telangana activists) ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ దిండిగాల రాజేందర్, బీఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షులు ఎడ్ల శ్రీనివాస్(Edla Srinivas) పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ సమయంలో పోరాటం చేసిన ఉద్యమకారుల సేవలను గుర్తిస్తూ వారిని శాలువాలతో సత్కరించి గౌరవించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారి త్యాగాలు, కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఉద్యమకారుల సేవలను గుర్తించి సన్మానించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు