అధికారుల ఇబ్బందులను తొలగించాలి

12-10-2026 | 09:13pm

నిర్మల్,(విజయక్రాంతి): సారంగాపూర్ మండలం(Sarangapur Mandal) సోనాపూర్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని అర్కాయితండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అటవీశాఖ అధికారులు అడ్డంకులు తొలగించాలని కోరుతూ లబ్ధిదారులు సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. లంబాడ, మథుర సామాజిక వర్గాలకు చెందిన 40 కుటుంబాలు గత 40 ఏళ్లుగా అటవీ ప్రాంతంలోని గుడిసెల్లో నివసిస్తున్నాయని తెలిపారు.

ప్రభుత్వం తమకు ఇందిరమ్మ ఇళ్ల(Indiraamma Homes)ను మంజూరు చేసినప్పటికీ, ఇళ్ల నిర్మాణానికి అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు