ప్రజావాణి సమస్యల పరిష్కారానికి చర్యలు

12-10-2026 | 09:20pm

అర్జీలను పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తాం: ఎంపీడీవో

ధర్మపురి,(విజయక్రాంతి): ప్రజావాణి(Prajavani) కార్యక్రమంలో ప్రజలు సమర్పించే వినతులకు ప్రాధాన్యతనిస్తూ, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎండపల్లి ఎంపీడీవో దొండ కృపాకర్(Endapally MPDO Donda Krusakar) తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజావాణిలో అందిన అర్జీలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి, నిబంధనల ప్రకారం పరిష్కరించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.

ముఖ్యంగా గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ, పింఛన్లు, ఇతర సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి తగిన చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని, అర్జీల పరిష్కారంలో జాప్యం జరగకుండా సంబంధిత అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఈ సందర్బంగా ఎంపీడీవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అన్వేష్, మండల వ్యవసాయాధికారి కె.మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు