లైన్‌మెన్ నుంచి లైన్ ఇన్‌స్పెక్టర్‌గా!

01-10-2026 | 11:52am

ఆళ్లపల్లి,సెప్టెంబర్ 30(విజయ క్రాంతి): లైన్‌మెన్ జగన్నాథంకు లైన్ ఇన్‌స్పెక్టర్‌ (Line Inspector)గా పదోన్నతి లభించింది. ఈ మేరకు పదోన్నతి ఉత్తర్వులను డీఈ (DE) రంగస్వామి చేతుల మీదుగా జగన్నాథం అందుకున్నారు.అనంతరం టేకులపల్లి సెక్షన్‌ (Section)లో ఐఎన్‌టీయూసీ-327 (INTUC-327) యూనియన్ జిల్లా, డివిజన్ నాయకులు, ఏఈ (AE) జగదీష్, సబ్‌ఇంజినీర్ (Sub Engineer) నజీర్ సమక్షంలో లైన్ ఇన్‌స్పెక్టర్‌గా జగన్నాథం బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా డీఈ (DE) రంగస్వామి, ఐఎన్‌టీయూసీ (INTUC) నాయకులు జగన్నాథంకు శుభాకాంక్షలు తెలిపారు. నిబద్ధతతో (Commitment) పనిచేస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలు (Better Services) అందించాలని, సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ-327 (INTUC-327) జిల్లా, డివిజన్ నాయకులు ఈ. రాజేష్, ఎం. జానారత్నం, శివకుమార్, కిరణ్‌కుమార్, సెక్షన్ సిబ్బంది, లైన్‌మెన్‌లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా లైన్ ఇన్‌స్పెక్టర్ జగన్నాథంను ఘనంగా సత్కరించారు.

మరిన్ని వార్తలు