అర్జెంటీనా దూకుడు

01-10-2026 | 07:28am

కెప్టెన్‌గా తొలి గోల్.. రొమేరో హెడ్డర్‌తో అర్జెంటీనా జోరు!

కార్డోబా: బొలీవియాతో(Argentina vs Bolivia) జరుగుతున్న అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో అర్జెంటీనా అదరగొడుతోంది. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్న అర్జెంటీనా 4-0తో భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వరుస గోల్స్‌తో బొలీవియాపై ఒత్తిడి పెంచిన అర్జెంటీనా.. ఇప్పుడు మూడో గోల్‌ను కూడా తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా కెప్టెన్ క్రిస్టియన్ ‘కుటి’ రొమేరో(Romero first goal) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అద్భుతమైన హెడ్డర్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపిన రొమేరో(Cristian Romero goal).. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన తొలి గోల్‌ను నమోదు చేశాడు. దీంతో అర్జెంటీనా ఆధిక్యం 3-0కు చేరింది.

అంతకుముందు లౌటారో మార్టినెజ్ తొలి గోల్‌తో అర్జెంటీనాకు శుభారంభం అందించగా.. యువ సంచలనం నికో పాజ్( Nico Paz goal) అద్భుతమైన ఫినిషింగ్‌తో రెండో గోల్ సాధించాడు. ఆ తర్వాత రొమేరో హెడ్డర్‌తో మూడో గోల్ రావడంతో అర్జెంటీనా అభిమానుల్లో సంబరాలు మిన్నంటాయి. ఈ మ్యాచ్‌కు స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ(Lionel Messi) దూరంగా ఉన్నప్పటికీ, అర్జెంటీనా ఆటగాళ్లు మాత్రం దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు. బొలీవియాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస దాడులు చేస్తూ స్కోర్‌ను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ప్రస్తుతం అర్జెంటీనా 4-0తో ముందంజలో ఉండగా.. బొలీవియా కనీసం ఒక్క గోల్ అయినా సాధించి మ్యాచ్‌లోకి తిరిగి వస్తుందా? లేక అర్జెంటీనా(Argentina ) ఆధిక్యాన్ని మరింత పెంచుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు