శ్రీలంకకు చుక్కలు.. ఫైనల్‌లో భారత్!
లంకపై భారత్ విధ్వంసం.. ఒక్కో వికెట్.. ఒక్కో షాక్!
నాగోయా: ఆసియా క్రీడలు(Asian Games 2026) 2026లో భారత క్రికెట్ జట్టు మరోసారి గోల్డ్ మెడల్ రేసులోకి దూసుకెళ్లింది. శ్రీలంకతో జరిగిన పురుషుల క్రికెట్ సెమీఫైనల్‌లో 124 పరుగుల భారీ తేడాతో భారత్ ఘన విజయం సాధించి ఫైనల్(India final Asian Games 2026) బెర్త్ ఖాయం చేసుకుంది. దీంతో ఇప్పుడు స్వర్ణ పతకం కోసం పాకిస్థాన్‌తో తలపడనుంది. పాకిస్థాన్ తొలి సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు(IND vs SL) ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. అభిషేక్ శర్మ 7, సంజూ శాంసన్ 7 పరుగులకే వెనుదిరిగారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 13 పరుగులు చేశాడు. ఈ దశలో ఇషాన్ కిషన్ భారత ఇన్నింగ్స్‌ను భుజాలపై మోశాడు. 46 బంతుల్లో 80 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన ఇషాన్.. 4 ఫోర్లు, 5 సిక్సర్లతో స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు. వైభవ్ సూర్యవంశీ కూడా 21 బంతుల్లో 38 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
ఇషాన్-వైభవ్( Vaibhav Suryavanshi) ఇన్నింగ్స్‌లతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో థరిందు రత్నాయകെ, కెప్టెన్ సహాన్ అరాచ్చిగే చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. వానుజ సహాన్, లసిత్ క్రూస్‌పుల్లే, నువానిందు ఫెర్నాండో తలో వికెట్ తీశారు.
170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక( IND vs SL scorecard) భారత బౌలింగ్ దాడిని తట్టుకోలేక 45 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ 124 పరుగుల తేడాతో సెమీఫైనల్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆసియా క్రీడల గోల్డ్ మెడల్ కోసం భారత్-పాకిస్థాన్ ఫైనల్ జరగనుంది. ఒకవైపు ఇషాన్ కిషన్ బ్యాట్‌తో దుమ్మురేపగా.. మరోవైపు భారత బౌలర్లు శ్రీలంక బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చారు. దీంతో ఫైనల్‌లో పాకిస్థాన్‌తో మరో హై-వోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది.