తెలంగాణలో వానలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మరోసారి మారబోతోంది. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ.. రానున్న రెండు మూడు రోజుల్లో వర్షాల( Telangana Rain Alert) ప్రభావం పెరిగే అవకాశం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థల ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలోనూ అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజా అంచనాలు సూచిస్తున్నాయి.
నేడు పొడి వాతావరణం..
అక్టోబర్ 1న తెలంగాణలో ప్రధానంగా పొడి వాతావరణమే కొనసాగనుంది. వర్ష సూచన(Rain Alert) పెద్దగా లేకపోవడంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఈ పరిస్థితి ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం లేదని తాజా అంచనాలు చెబుతున్నాయి.
అక్టోబర్ 2 నుంచి తెలంగాణలో వానలు..
అక్టోబర్ 2 నుంచి 3 వరకు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 3 నుంచి 4 వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేటతో పాటు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(IMD Weather Alert) పడే అవకాశం ఉంది.
ఏపీలోనూ వర్ష సూచన..
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh Rain Alert) కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో అక్టోబర్ 1 నుంచి 3 వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. అక్టోబర్ 4 నుంచి పరిస్థితులు సాధారణంగా మారే అవకాశం ఉంది.
ఉపరితల ఆవర్తనం ప్రభావం..
బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, తేమతో కూడిన గాలుల ప్రభావం కారణంగా దక్షిణ భారతదేశంలో(South India) వర్ష కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకేసారి ఎండలు, మరోవైపు అక్కడక్కడ వర్షాలు కనిపించే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రజలు వాతావరణ శాఖ(Meteorological Department) తాజా సూచనలను గమనించాలని, ఉరుములు-మెరుపులతో కూడిన వర్షాల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.