సింగరేణిని అప్పుల నుంచి కాపాడాలి
- రాష్ట్ర ప్రభుత్వ బకాయిలు వెంటనే చెల్లించాలి
- ఎంపీ ఈటల రాజేందర్
- మంచాలలో ‘సింగరేణి బకాయి లడాయి’
మంచిర్యాల, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): సింగరేణి సంస్థను ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడేందుకు సంస్థకు రావాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(MP Eatala Rajender) డిమాండ్ చేశారు. బుధవారం సింగరేణి బకాయి లడాయి పేరుతో మంచాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సీసీసీ కార్నల్ వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడారు.
భవిష్యత్ తరాలకు సింగరేణి కీలక సంస్థ అని, సింగరేణిలో ప్రస్తుతం సుమారు 39 వేల మంది ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. ఉద్యోగుల సంఖ్య ను తగ్గించే చర్యలను నిలిపివేయాలని కోరా రు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణికి రూ.25 వేల కోట్లు బకాయి ఉండగా, ప్రస్తు త ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.55 వేల కోట్లకు పెంచిందని ఆరోపించారు. కాంట్రా క్టు కార్మికులను పెంచి రెగ్యులర్ ఉద్యోగాలను తగ్గించే ఆలోచనను ప్రభుత్వం విర మించుకోవాలన్నారు.
కాంట్రాక్టు కార్మికులకు రోజుకు రూ.1,250 చెల్లించాల్సి ఉండగా సింగరేణిలో రూ.650 మాత్రమే చెల్లిస్తున్నారని ఆరోపించారు. కార్మికుల శ్రమ దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. సింగరేణి సీఎస్ఆర్ నిధులను సంస్థ పరిధిలోని కాలనీల అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. కార్మికుల కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపర్చాలని కోరారు. హైదరాబాద్ వంటి నగరాల్లో ఇతర కార్యక్రమాలకు సీఎస్ఆర్ నిధులను వినియోగించడాన్ని నిలిపివేయాలన్నారు.
గత, ప్రస్తుత ప్రభుత్వాల నిర్ణయాలతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు, ప్రాంత ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఈటల ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్వా యి హరీష్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ మల్కా కొముర య్య, బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగునురు వెంకటేశ్వరగౌడ్, నాయకులు శ్రీదేవి, దుర్గ అశోక్, బొడిగె శోభ, సత్రం రమేష్, కుర్ర చక్రవర్తి, గోమాస శ్రీనివాస్, బేర సత్యనారాయణ, అప్పని శ్రీనివాస్, ఈర్ల సదానందం, కందుల సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.