ఆధ్యాత్మిక భావనతో మానసిక ప్రశాంతత
పండుగలతో నూతన ఉత్తేజ, మానసిక ప్రశాంతత.
ఉత్సవాలను విజయవంతం చేయాలి.
కొత్తగూడెం శాసనసభసభ్యులు కూనంనేని సాంబశివరావు.
పాల్వంచ, అక్టోబర్ 11, (విజయక్రాంతి): అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కొత్తగూడెం శాసనసభసభ్యులు కూనంనేని సాంబశివరావు(Koonamneni Sambasiva Rao) అన్నారు. పాల్వంచ మండలంలోని కేపీ జగన్నాధపురం గ్రామంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పెద్దమ్మ తల్లి దేవస్థానంలో(Peddamma Thalli Devasthanam) ఆదివారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ప్రత్యేక పూజల అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగలు, ఆధ్యాత్మిక భావన సమాజంలో మానసిక ప్రశాంతతను నింపుతాయన్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు క్యూలైన్లు, తాగునీరు, ప్రసాదాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు.
ఉత్సవాలు ప్రశాంతంగా సాగేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. అనంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, ఆలయ ఈవో విజయ్ కుమార్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబా, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, ఉప్పుశెట్టి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.