ప్రైవేట్ కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె
అశ్వారావుపేట అక్టోబర్ 17,(విజయ క్రాంతి): నియోజక వర్గ కేంద్రమైన అశ్వారావుపేట మండలం(Aswaraopeta Mandal) లో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ(Jare Adinarayana) శనివారం పర్యటించారు. అశ్వారావుపేట నూతనంగా ఏర్పాటు చేసిన మాధురి ఫైర్ వర్క్స్ దుకాణాన్ని(Madhuri Fireworks Shop) ఎమ్మెల్యే జారే ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం అశ్వారావుపేట మున్సిపాలిటీ(Ashwaraopeta Municipality) పరిధిలోని గుర్రాలచెరువు గ్రామానికి చెందిన కలపాల సోంసన్ అనే బాలుడు ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకుని బాలుడి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలుసుకుని బాలుడి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాలుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అశ్వారావుపేట ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సోషల్ మీడియా(Social Media) విభాగంలో పనిచేస్తున్న సీహెచ్ విజయ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమాలలో మండలం అధ్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ , ఆత్మకమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు , జిల్లా పిసిసి సభ్యులు తుమ్మా రాంబాబు , జూపల్లి ప్రమోద్ , తాడేపల్లి రవి , మున్సిపల్ కౌన్సిలర్ లు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.