గోవాలో రాహుల్ గాంధీ పర్యటన
28 రోజుల కాంగ్రెస్ యాత్రకు ముగింపు!
న్యూఢిల్లీ: గోవా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రచారాన్ని కీలక దశకు తీసుకెళ్తోంది. కాంగ్రెస్ అగ్రనేత Rahul Gandhi అక్టోబర్ 18న గోవాలో పర్యటించి, మార్గావ్లో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చేపట్టిన ‘Goy Rakhon Yatra’ ముగింపు సందర్భంగా ఈ సభ జరగనుంది. ఈ విషయాన్ని గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిరీష్ చోడంకర్ వెల్లడించారు. 28 రోజుల పాటు కొనసాగిన ఈ యాత్ర సెప్టెంబర్ 22న ప్రారంభమైంది. గోవాలోని మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా కాంగ్రెస్ ఈ Public Outreach Campaign నిర్వహించింది. రాష్ట్ర భూములు, ప్రత్యేక గుర్తింపు, పర్యావరణం, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పార్టీ చెబుతోంది. యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో ప్రజలను కలుసుకుంటూ స్థానిక సమస్యలపై మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించింది. ఇప్పుడు మార్గావ్లో జరిగే ముగింపు సభలో రాహుల్ గాంధీ ఏ అంశాలను ప్రస్తావిస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ సభతో గోవాలో కాంగ్రెస్ ప్రచారానికి ముగింపు పలకనున్నారు.