జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ కొత్త కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

11-10-2026 | 06:18pm

- అధ్యక్షుడిగా తొలం వెంకటేశ్వర్లు

- కార్యదర్శిగా ఎ. శాంతి, ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఎ. ధనలక్ష్మి ఎన్నిక

మణుగూరు,అక్టోబర్ 11,(విజయక్రాంతి ): జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్(Junior Forest Officers Association) మణుగూరు యూనిట్ నూతన కార్యవర్గ ఎన్నికలు(Executive Committee Elections) ఏకగ్రీవంగా జరిగాయి. ఆదివారం సందేళ్లపాడు నర్సరీలో పి. ఎర్రయ్య అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఖాళీగా ఉన్న మూడు పదవులకు సభ్యుల ఏకాభిప్రాయంతో నూతన ప్రతినిధులను ఎన్నుకున్నారు.

అసోసియేషన్ అధ్యక్షుడిగా తొలం వెంకటేశ్వర్లు (డీఆర్ఓ, బయ్యారం), కార్యదర్శిగా ఎ. శాంతి (ఎఫ్‌బీఓ,pవంగా ఎన్నికయ్యారు.ఈ ఎన్నికలకు పరిశీలకులుగా కిన్నెరసాని యూనిట్ అధ్యక్షుడు రామకృష్ణ, పాల్వంచ యూనిట్ అధ్యక్షుడు క్రాంతి కుమార్, ఆర్గనైజేషన్ సెక్రటరీ శోభన్ బాబు వ్యవహరించారు. మణుగూరు యూనిట్ తరఫున జాయింట్ సెక్రటరీ జి. బాబురావు, ట్రెజరర్ భీంచందర్ ఎన్నికల నిర్వహణలో పాల్గొన్నారు.

ఈ సమావేశానికి అశ్వాపురం, మణుగూరు, బయ్యారం రేంజ్‌లకు చెందిన సుమారు 40 మంది ఎఫ్‌బీఓలు, ఎఫ్‌ఎస్‌ఓలు, డైఆర్ఓలు, అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి సభ్యులు అభినందనలు తెలిపారు.అసోసియేషన్ ఐక్యతను కాపాడుతూ, సభ్యుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నూతన కార్యవర్గానికి సభ్యులు ఆకాంక్షించారు. పరస్పర సహకారంతో సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు