బుగ్గవాగుపై ప్రత్యేక నిఘా..

24-09-2026 | 04:53pm

భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య

ఇల్లెందు, (విజయక్రాంతి): అల్పపీడనం ప్రభావంతో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు(Heavy rains) కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) సూచించారు. రెడ్‌ అలర్ట్‌ నేపథ్యంలో ఇల్లందు పట్టణంలోని బుగ్గవాగు పరివాహక 3, 4, 5, 6, 18, 19, 20, 21 వార్డులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, చెరువుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ప్రతి వార్డులో 24 గంటల సహాయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వరద ప్రవాహ ప్రాంతాల వైపు వెళ్లొద్దని ఎమ్మెల్యే కోరారు.

మరిన్ని వార్తలు