6 September, 2026 | 4:04 PM

హైదరాబాద్‌లో 32వ ఐఎస్‌వోఐ సదస్సు

06-09-2026 | 05:10am

సాంకేతికత, ఆధునిక చికిత్సా విధానాలపై అవగాహన 

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : ఓరల్ ఇంప్లాంటాలజీ రంగం(Oral Implantology Sector,)లోని తాజా సాంకేతికతలు(Technologies), ఆధునిక చికిత్సా(Modern Treatments) విధానాలపై అవగాహన కల్పించేందుకు ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరల్ ఇంప్లాంటలజిస్ట్(Indian Society of Oral Implantologists) (ఐఎస్‌వోఐ) 32వ జాతీయ సదస్సు(national conference) హైదరాబాద్ లో జరుగుతోంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో ఈ ప్రతిష్టాత్మక సదస్సు ని ర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 3 నుంచి 6 వరకు నాలుగు రోజుల పాటు జరుగుతున్న సదస్సుకు దేశవ్యాప్తంగా డెంటల్ నిపుణులు, పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ వి ద్యార్థులు హాజరయ్యారు.

60 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ఫ్యాకల్టీ, స్పీకర్లు పాల్గొంటుండగా.. ఇందులో సుమారు 12 మంది అంతర్జాతీయ, 50 మందికి పైగా జాతీయ నిపుణులు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ప్రీ-కాన్ఫరెన్స్‌ను ఎమ్మె ల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, ప్రధాన కాన్ఫరెన్స్‌ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు.

ఐఎస్‌వోఐ నేష నల్ ప్రెసిడెంట్ డాక్టర్ శరద్ శెట్టి, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ విజయ్ శ్రీని వాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ పద్మరాయలు, అధికార ప్రతినిధి డాక్టర్ శరత్‌బాబు సదస్సు ప్రాధాన్యత ను వివ రించారు. దేశవ్యాప్తంగా 1000 మం దికి పైగా డెంటిస్టులు, విద్యార్థులు, నిపుణులు ఒకే వేదికపై పాల్గొని ఇంప్లాంటాలజీ లో వస్తున్న ఆధునిక మార్పులు, కొత్త టెక్ని క్స్‌పై జ్ఞానాన్ని పంచుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు