వికారంతో బాధపడుతున్నారా?
27-04-2025
కొంతమందికి బస్సు ప్రయాణం అంటే కంగారు పడిపోతారు. మరికొందరు కారు, రైలు, విమాన ప్రయాణాలన్నా హడలెత్తిపోతారు. కారణం.. ప్రయాణాల్లో వాంతులు, వికారం, కళ్లు తిరగడం, చెమటలు పట్టడం, అలసట వంటి లక్షణాలు వాళ్లని స్థిమితంగా ఉండనీయవు.