529 మంది అరెస్ట్.. తాగితే అంతే సంగతులు
పబ్లిక్ ప్లేస్‌లో మద్యం తాగుతూ రచ్చ.. ఒక్కరోజే 529 మంది అరెస్ట్!
జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో పోలీసుల భారీ Crackdown కలకలం రేపింది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, అసభ్యంగా ప్రవర్తించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు కొరడా ఝళిపించారు. శుక్రవారం ఒక్కరోజే నిర్వహించిన ప్రత్యేక Police Operationలో ఏకంగా 529 మందిని అరెస్ట్ చేశారు. నగరంలోని నాలుగు పోలీస్ జిల్లాల పరిధిలో ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. పబ్లిక్ ప్లేసెస్‌లో మద్యం తాగడం, హద్దులు దాటి ప్రవర్తించడం, సాధారణ ప్రజలకు అసౌకర్యం కలిగించే కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో అత్యధికంగా జైపూర్ ఈస్ట్ జిల్లాలో 170 మందిని అరెస్ట్ చేశారు.
ఇక జైపూర్ సౌత్‌లో 161 మంది, జైపూర్ వెస్ట్‌లో 116 మంది, జైపూర్ నార్త్‌లో 82 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 529 మందిపై చర్యలు తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ సచిన్ మిట్టల్ వెల్లడించారు. నగరంలో Public Order కాపాడేందుకు, ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలను నియంత్రించేందుకు ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని పోలీసుల చర్యలు స్పష్టం చేస్తున్నాయి.