బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా మ్యాజిక్
‘యే ప్రేమ్ మోల్ లియా’కు మంచి ఓపెనింగ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
బాలీవుడ్‌లో ఫ్యామిలీ(Bollywood Box Office Collection) ఎంటర్‌టైనర్స్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సూరజ్ బర్జాత్యా తెరకెక్కించిన తాజా చిత్రం ‘యే ప్రేమ్ మోల్ లియా’(Yeh Prem Mol Liya First Day Collection) బాక్సాఫీస్ వద్ద తన ప్రయాణాన్ని మంచి వసూళ్లతో ప్రారంభించింది. ఆయుష్మాన్ ఖురానా, షర్వరీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదలైన తొలి రోజే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి మొదటి రోజు దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ.4.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల గణాంకాలు వెల్లడించాయి.
ఇక నెట్ వసూళ్ల విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా రూ.4 కోట్ల నెట్ కలెక్షన్ నమోదైనట్లు సమాచారం. దీంతో సినిమా ఓపెనింగ్ డే రిపోర్ట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. రాజశ్రీ ప్రొడక్షన్స్, మహావీర్ జైన్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సూరజ్ బర్జాత్యా దర్శకత్వం, ఆయుష్మాన్ ఖురానా–షర్వరీ కాంబినేషన్‌తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. మరి తొలి రోజు వచ్చిన ఈ కలెక్షన్స్‌ను కొనసాగిస్తూ వీకెండ్‌లో మూవీ మరింత వసూళ్లు సాధిస్తుందా? అనేది ఆసక్తిగా మారింది.