చెస్ బోర్డుపై తెలంగాణ పవర్

28-11-2026 | 12:27pm

నల్గొండ నుంచి ప్రపంచ వేదిక వరకు.. ప్రణీత్ అదిరిపోయే విక్టరీ!

అంతర్జాతీయ చెస్ వేదికపై తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ వుప్పల ప్రణీత్(Telangana Grandmaster Prraneeth) మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. వెనిజులాలో నిర్వహించిన World Under-20 Chess Championshipలో అద్భుతమైన ఆటతీరుతో కాంస్య పతకాన్ని సాధించాడు. 19 ఏళ్ల వయసులోనే ప్రపంచ స్థాయి పోటీలో పతకం గెలుచుకోవడంతో తెలంగాణతో పాటు భారత చెస్ వర్గాల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది. నల్గొండ జిల్లా అలగడప గ్రామానికి చెందిన ప్రణీత్ చిన్న వయసు నుంచే చదరంగంలో అసాధారణ ప్రతిభ కనబరిచాడు. గతంలో Under-11 World No.1 ర్యాంకును సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. తన ఆటలో నిలకడ, వ్యూహాత్మక ఆలోచనలతో ఒక్కో మెట్టు ఎదుగుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.

2022 మార్చిలో International Master (IM) టైటిల్‌ను సొంతం చేసుకున్న ప్రణీత్.. 2023లో చివరి Grandmaster Normను పూర్తి చేశాడు. దీంతో భారత్‌కు 82వ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచి రికార్డు సృష్టించాడు. తాజాగా అండర్-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో Bronze Medal సాధించి తన కెరీర్‌లో మరో ముఖ్యమైన విజయాన్ని నమోదు చేశాడు. ప్రపంచ చెస్ దిగ్గజం Magnus Carlsenకు ప్రణీత్ వీరాభిమాని. రేస్ అకాడమీకి చెందిన ప్రముఖ కోచ్ ఎన్‌వీఎస్ రామరాజు వద్ద అతడు శిక్షణ పొందాడు. ఇదే అకాడమీ కోచ్ ద్రోణవల్లి హారికకు కూడా శిక్షణ అందించారు. సరైన మార్గదర్శకత్వం, కఠినమైన Practice, నిరంతర కృషితో ప్రణీత్ అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేస్తున్నాడు. తాజా విజయంతో నల్గొండ జిల్లా అలగడప గ్రామం పేరు మరోసారి ప్రపంచ చెస్ మ్యాప్‌పై నిలిచింది. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ టోర్నమెంట్లలో ప్రణీత్ మరింత రాణించాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

మరిన్ని వార్తలు