చిప్ డిజైన్‌లో సవాళ్లపై గీతం విద్యార్థులకు అవగాహన

28-11-2026 | 01:58pm

పటాన్‌చెరు, నవంబర్ 28 (విజయక్రాంతి): గీతం ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అతిథి ఉపన్యాసంలో డాక్టర్ నాగతేజ తొట్టెంపూడి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆధునిక చిప్ డిజైన్‌లో పవర్ మేనేజ్‌మెంట్ (Power Management), అనలాగ్ డిజైన్, సిస్టమ్ ఆన్ చిప్ (SoC) సాంకేతికతలపై వివరించారు.

చిప్ తయారీ, రూపకల్పనలో పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లను విద్యార్థులకు వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటు పరిశోధనలపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు.అలాగే తైవాన్‌లో ఉన్నత విద్య, పరిశోధన, స్కాలర్‌షిప్ (Scholarships) అవకాశాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు