దుర్గగుడిలో షాకింగ్ మోసం
డబ్బులు ఫుల్.. లడ్డూలు తక్కువ..
విజయవాడ, నవంబర్ 28: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో మరో అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భక్తులకు ప్రసాదాలు విక్రయించే విషయంలో కొందరు Contract Staff చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. డబ్బులు పూర్తిగా తీసుకుంటూ.. అందుకు తగ్గ సంఖ్యలో లడ్డూలు ఇవ్వకుండా మోసానికి పాల్పడుతున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఆలయ EO శీనా నాయక్‌కు ఫిర్యాదు చేశారు.
భక్తుల Complaintపై వెంటనే స్పందించిన ఈవో విచారణ చేపట్టారు. ప్రసాదాల విక్రయాల తీరును పరిశీలించగా.. నగదు వసూలు చేసిన సంఖ్యకు, భక్తులకు అందించిన లడ్డూల సంఖ్యకు తేడా ఉన్నట్లు నిర్ధారించారు. డబ్బులు పూర్తిగా తీసుకుని తక్కువ సంఖ్యలో లడ్డూలు అందిస్తున్నట్లు విచారణలో తేలింది. దీంతో బాధ్యులైన Contract Employeesపై Suspension Action తీసుకున్నారు. సంబంధిత Supervisorకు Show Cause Notice జారీ చేశారు.
దుర్గగుడిలో భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసేలా జరుగుతున్న అక్రమాలపై ఈవో సీరియస్ అయ్యారు. ఆలయంలోని ఇతర విభాగాల్లోనూ ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయా అనే కోణంలో Internal Inquiry చేపట్టాలని ఆదేశించారు. ప్రసాదాల విక్రయాల్లో Transparency పాటించాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. ఇటీవల దుర్గగుడిలో 500 దర్శనం టికెట్లను Recycling చేసిన వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు Outsourcing Staffను ఈవో ఇప్పటికే Suspend చేశారు. తాజాగా Laddu Salesలోనూ అక్రమాలు బయటపడటంతో ఆలయ నిర్వహణపై చర్చ మొదలైంది. భక్తులు సమర్పించే కానుకలు, కొనుగోలు చేసే ప్రసాదాల విషయంలో ఇలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.