కంటైనర్-కారు ఢీ..నుజ్జునుజ్జయిన కారు!
కొడిమ్యాల, నవంబర్ 1 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొడిమ్యాల మండలం పూడూరు గ్రామ శివారులోని కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారిపై గూడ్స్ కంటైనర్, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది (Road Accident).వరంగల్ వైపు వెళ్తున్న గూడ్స్ కంటైనర్.. కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న కారును గౌరాపూర్ వ్యవసాయ గోడౌన్ల వద్ద బలంగా ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు (Head-on Collision).
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కరీంనగర్‌కు చెందిన దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు వెల్లడించారు (Critical Condition).ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమయ్యారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది (Accident Investigation).