గణిత ఒలంపియాడ్లో జయ ఐఐటీ విద్యార్థుల జోరు
కోదాడ, నవంబర్ 1 (విజయక్రాంతి): రామచంద్రాపురంలోని రామానుజన్ గణిత అకాడమీ నిర్వహించిన గణిత ఒలింపియాడ్‌లో జయ ఐఐటీ ఒలింపియాడ్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారని పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. (Mathematics Olympiad) శనివారం పట్టణంలోని పాఠశాలలో విద్యార్థులను అభినందిస్తూ ఆయన మాట్లాడారు.
ఈ పోటీల్లో ఐదో తరగతి నుంచి ఇద్దరు, ఆరో తరగతి నుంచి ఒకరు, ఏడో తరగతి నుంచి ఇద్దరు, ఎనిమిదో తరగతి నుంచి ఇద్దరు, తొమ్మిదో తరగతి నుంచి ఐదుగురు, పదో తరగతి నుంచి ముగ్గురు విద్యార్థులు అర్హత సాధించారు. (Student Achievements) మొత్తం 15 మంది విద్యార్థులు తదుపరి స్థాయికి అర్హత పొందడం పట్ల పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు వారికి సహకరించిన ఉపాధ్యాయ బృందాన్ని కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్లు జెల్లి పద్మ, బింగి జ్యోతి, ప్రధానోపాధ్యాయుడు చిలివేరు వేణు అభినందించారు. (Academic Excellence) విద్యార్థుల విజయానికి తోడ్పడుతున్న తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. (School Achievement)