య్యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో కీలక మలుపు
కోరుట్ల : యూట్యూబర్ వైష్ణవి(YouTuber Vaishnavi) భర్త హరిబాబు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోరుట్ల పోలీస్ స్టేషన్(Korutla Police Station)లో వైష్ణవి సోదరుడు సంతోష్ లొంగిపోయాడు. హరిబాబును తానే చంపానని వైష్ణవి సోదరుడు సెల్ఫీ వీడియో విడుదల చేయడం స్థానికంగా కలకలం రేపింది. తన చెల్లిని చంపినందుకు ప్రతీకారంగా హరిబాబును చంపినట్లు వెల్లడించాడు. ''నా చెల్లెను చంపినందుకు హరిబాబును చంపేశా. నేను పోలీస్ స్టేషన్ లో లొంగిపోతున్నా. మా ఇంట్లో జరిగినట్లు ఏ ఇంట్లోనూ జరగవద్దని చంపాను.'' అంటూ సంతోష్ వీడియోలో పేర్కొన్నాడు. నిన్న సాయంత్రం నిజామాబాద్(Nizamabad)లో నడిరోడ్డుపై హరిబాబు హత్యకు గురైన విషయం తెలిసిందే. మార్చి నెలలలో యూట్యూబర్ వైష్ణవి హత్యకు గురైంది. వైష్ణవి హత్య కేసులో జైలుకు వెళ్లిన హరిబాబు ఇటీవలే బెయిల్ పై విడుదలై బయటకు వచ్చాడు. ఈ నేపథ్యంలోనే పక్క ప్లాన్ వేసిన సంతోష్ హరిబాబును మట్టుపెట్టాడు.