జావా ఆల్ స్టార్స్ సిల్వర్ నైట్ విజేత సోలాకిడౌ
- గ్లోబల్ ఛెస్ లీగ్ బెస్ట్ ప్లేయర్‌గా ఘనత
- గ్రీకు చెస్ఛాంపియన్పై ప్రశంసలు
ముంబయి, 17 సెప్టెంబర్ 2026: అంతర్జాతీయ విమెన్ గ్రాండ్ మాస్టర్ (International Women's Grand Master), గ్రీకు చెస్ చాంపియన్ స్టార్గ్లోబల్ ఛెస్ లీగ్ (Greek Chess Champion StarGlobal Chess League) 2026 నాలుగవ ఎడిషన్‌లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచిన స్టావ్రౌలా సోలాకిడౌ మరో అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక జావా ఆల్ స్టార్స్ 42 బాబర్ సిల్వర్ నైట్‌ను గెలుపొందింది. గాంజెస్ గ్రాండ్ మాస్టర్స్‌కు ప్రాతినిధ్యంవహిస్తున్న స్టావ్రౌలా ఇటీవల తమ జట్టు మొదటి గ్లోబల్ చెస్ లీగ్ టైటిల్‌ను కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించింది.
ఈ టోర్నీ ఆరంభంలో కాస్త తడబడినా తర్వాత అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈ పోటీల్లో ఆమె ప్రదర్శనకు గుర్తింపుగా అత్యుత్తమ పురస్కారం గెలుచుకుంది. ఆమె పెర్ఫార్మెన్స్ కుజావా ఆల్ స్టా ర్స్ 42 బాబర్ సిల్వర్ నైట్ అందుకుంది. స్టా వ్రౌలా ప్రయాణం ప్రత్యేకంగా నిలిచిందనీ క్లాసిక్ లెజెండ్స్ కో ఫౌండర్ అనుపమ్ థరేజ ప్రశంసించారు. ఆమె తన విజయాన్ని తన జట్టుతో పంచుకున్న విధానం అద్భుతమన్నారు. కాగా మహీంద్ర గ్రూప్ చైర్మన్, ఆనం ద్ మహీంద్ర, బెంగళూరులో జరిగిన గ్లోబల్ చెస్ లీగ్ నాలుగవ ఎడిషన్ ప్రారంభంలో ద జావా ఆల్ స్టార్స్ 42 బాబర్-సిల్వర్ నైట్‌ను ప్రారంభించారు.