సర్కారు కొలువు ముద్దు! ప్రభుత్వ బడి వద్దు
- ప్రైవేటు పాఠశాలల వైపే తల్లిదండ్రుల చూపు
- సకల వసతులు ఉన్నా పట్టని వైనం
హన్వాడ, సెప్టెంబర్ 17 : చెబుతున్న విషయాలు అందరికీ తెలిసినప్పటికీ చర్చించుకో వాల్సిన అంశం గాడిలో వలసిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి కీ సంబంధించి పలు అంశాలను విజయ క్రాంతి దినపత్రిక (Vijaya Kranthi Daily Newspaper) మండ ల పరిధిలోని ఇబ్రహీంబాద్ జెడ్పిహెచ్‌ఎస్ పాఠశాల లోనే కాదు వివిధ ప్రభుత్వ పాఠశాలలోవిద్యార్థుల నమోదు సంఖ్య రోజురో జుకు తగ్గుముఖం పడుతుందని విషయాలు మీ ముందుకు తీసుకువస్తుంది.
ప్రభుత్వ ఉద్యోగం తో పాటు ప్రభుత్వ టీచర్ అయితే చాలు ఇక జీవితం సంతోషకరంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయని ఎంతోమం ది చెబుతుండడం మనం పెట్టుకుంటాం. కాగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చదివించేందుకు చాలామంది తల్లిదండ్రులు అహిష్టతను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ విధానాలు ఇలాగే ముందుకు అడుగులు వేస్తే భవిష్యత్తులో మండలానికి ఒక ప్రభుత్వ పాఠశాల గతంలో ఉండే మాదిరిగా ఉండే రోజులు వచ్చేలా ఉన్నాయని ప్రస్తుత పరిస్థితులను చూస్తే అనిపిస్తుంది.
విశాలమైన మైదానం.. అవసరమైన సదుపాయాలు..
ప్రాథమిక పాఠశాల లో ఉపాధ్యాయులు కొంత మేరకు తక్కువగా ఉన్నప్పటికీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాత్రం అవసరం మేరకు ఉన్నత అధికారులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ విద్యార్థులకు నష్టం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కాగా చాలా జడ్పిహెచ్‌ఎస్ పాఠశాలలో కూడా ఆశించిన మేరకు విద్యార్థులు పాఠశాల మెట్లు ఎక్కడం లేదు. ప్రైవేట్ పాఠశాల వైపు తొంగి చూడడంతో ప్రభుత్వ పాఠశాలలో మనుగడ రోజురోజుకు విద్యార్థులు లేక తగ్గుముఖం పడుతుందని తెలుస్తుంది.
ఆరవ తరగతిలో ఒకే విద్యార్థిని..
మండల పరిధిలోని ఇబ్రహీంబాద్ జడ్పీహెచ్‌ఎస్ ప్రభుత్వ పాఠశాలలో ఆరవ తరగతిలో ఒక్కరే విద్యార్థిని చదువుకుంటుంది. ఆ విద్యార్థిని ప్రత్యేకంగా విద్యాబోధన చేస్తూ మరింత మంది విద్యార్థులు పాఠశాలలు కావాలని ఉపాధ్యాయుల కోరుతున్నప్పటికీ ఆ గ్రామంలో ప్రైవేట్ పాఠశాల వైపు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఉన్న ఒక విద్యార్థికి కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా సంబంధిత అధ్యాపక బృందం విద్యా బోధన చేస్తుంది.
సకల చదువు లేకుంటే ఎట్లా?
ఉపాధి కోసం గ్రామాల నుండి పట్టణాలకు కుటుంబాలు వలస వెళ్లడం వల్ల పిల్లల సంఖ్య తగ్గుతుందని కొందరు అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత భోజనం, పుస్తకాలు, సమగ్రాభివృద్ధి వసతులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని మరి కొందరు చెబుతుండ్రు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు, స్మార్ట్ బోర్డులు ఏర్పాటు చేసి ఆకర్షణీయమైన బోధన అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది.
విద్యార్థులు చదువులో ఆశించిన రాణించడం లేదని పరి కొందరు తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎలాగైనా కొట్టాలి ప్రభుత్వ పాఠశాలలో మాత్రం మా బిడ్డలు చదవకూడదని సంకల్పం చాలామంది ఉండడంతో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి రోజురోజుకు విద్యార్థులు లేని పాఠశాలలుగా మారుతున్నాయి.
ప్రైవేట్ పాఠశాలల పోటీతోనే...
గ్రామీణ ప్రాంతాల్లో సైతం తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలు, ఇంగ్లీష్ మీడియం వైపు మొగ్గు చూపడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు తగ్గుతోంది అలాగే తల్లిదండ్రులలో అవగాహన లోపం ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం, పుస్తకాలు వంటి పథకాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందనే నమ్మకం ఇంకా పెరగాల్సి ఉంది. గ్రామ సర్పంచ్ స్పందించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి బడిలో విద్యార్థుల సంఖ్య పెంపొందించగలరని కోరుతున్నాం.
అబ్దుల్ సమ్మద్, జెడ్పీహెచ్‌ఎస్ ఇబ్రహీంబాద్ హెచ్‌ఎం, హన్వాడ మండలం