గుట్టలకు గ్రహణం
- గద్వాలలో మట్టి దందా
- అనుమతులపై అధికారుల దాటవేత
- యథేచ్ఛగా తవ్వకాల ఆరోపణలు
- మైనింగ్‌దా? రెవెన్యూ శాఖదా? బాధ్యత ఎవరిది?
- కలెక్టర్ జోక్యంతోనే అసలు నిజాలు బయటపడతాయా?
గద్వాల టౌన్ అక్టోబర్ 11: జిల్లా కేంద్రం(District headquarters) చుట్టుపక్కల గుట్టలు కనుమరుగవుతున్నాయనే ఆరోపణలు,మరోవైపు మట్టిని తరలి స్తున్నారనే విమర్శలు,ఇంకోవైపు తమకు తెలియదంటున్న సంబంధిత శాఖల అధికారులు(Departmental officials). జోగులాంబ గద్వాల జిల్లాలో గుట్టల త వ్వకాల వ్యవహారం(The excavation affair) చర్చనీయాంశంగా మా రింది.
ప్రకృతి సంపదను కాపాడాల్సిన యం త్రాంగం ఏం చేస్తోంది?తవ్వకాలకు అనుమతులు ఇచ్చిందెవరు? అనుమతులు లేకుంటే అడ్డుకునేదెవరు?అన్న ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.జిల్లా కేంద్రానికి సమీపంలో గుట్టల తవ్వకాలపై ఆరోపణలు వస్తుండగా పట్టణంలోని జమ్మిచేడు రోడ్డులో రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే మట్టి తరలింపు జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు.
ఈ వ్యవహారంపై మైనింగ్,రెవెన్యూ శాఖల అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అనుమతులిచ్చింది ఎవరు?శాఖల మధ్య సమన్వయం ఏది?గుట్టల తవ్వకాలు మట్టి తరలింపుపై మైనింగ్ శాఖ ఏడీని చరవాణి ద్వారా వివరణ కోరగా తమ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని బహుశా తహసీల్దార్ కార్యాలయం నుంచి ఇచ్చి ఉండవచ్చని తెలిపినట్లు సమాచారం.
ఇదే అంశం పై తహసీల్దార్ను సంప్రదించగా తమ కార్యాలయం నుంచి కూడా ఎలాంటి అనుమతు లు మంజూరు చేయలేదని స్పష్టం చేసినట్లు తెలిసింది.రెండు శాఖలు అనుమతుల విషయంలో తమకు సంబంధం లేదని చెబుతుండటంతో అసలు తవ్వకాలు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.
తవ్వకాలు చేపడుతున్న వ్యక్తులెవరు?మట్టి తరలింపునకు అవసరమైన పత్రాలు ఉన్నాయా?ఏదైనా శాఖ అనుమతి ఇచ్చిందా?అన్న వివరాలను అధికారులు బయటపెట్టాల్సిన అవసరం ఉంది.పరస్పరం బాధ్యతలు నెట్టుకోవడం కంటే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు.
స్టేషన్ సమీపంలోనే తరలింపు అధికారుల దృష్టికి రాలేదా?గద్వాల పట్టణంలోని జమ్మిచేడు రోడ్డులో రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో మట్టి తరలింపుపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.పోలీస్ స్టేషన్కు అతి సమీపంలోనే ఈ వ్యవహారం జరుగుతోందని స్థానికులు చెబుతుండటంతో పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.మట్టి తరలిస్తున్న వాహనాలకు అనుమతులు ఉన్నాయా?
వాటి రవాణా పత్రాలను పరిశీలించారా? నిబంధనలకు విరుద్ధంగా తరలింపు జరుగుతుంటే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా సంబంధిత అధికారులు స్వయంగా తనిఖీలు నిర్వహించి వాస్తవాలను నిర్ధారించాలని స్థానికులు కోరుతున్నారు.
మాది కాదు. మైనింగ్ శాఖ చూసుకోవాలి
జమ్మిచేడు రోడ్డులో మట్టి తరలింపు అంశంపై గద్వాల రూరల్ ఎస్త్స్రని చరవాణి ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.గద్వాల సీఐని వివరణ కోరగా ఈ వ్యవహారం మైనింగ్ శాఖకు సంబంధించినదని ఆ శాఖ అధికారులే పరిశీలించాలని తెలిపినట్లు స మాచారం.అయితే తమ దృష్టికి వస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టంగా తెలి పారు.
ఈ నేపథ్యంలో మట్టి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా లేదా అన్నది మై నింగ్, రెవెన్యూ శాఖలు నిర్ధారించాల్సి ఉండ గా నిబంధనల ఉల్లంఘన జరిగితే సంబంధిత అధికారులు తమ పరిధిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.శాఖల మధ్య సమన్వయం లేకపోతే అక్రమాలకు అడ్డుకట్ట వేయడం ఎలా సాధ్యమన్న ప్రశ్న లు వినిపిస్తున్నాయి.
మామూళ్ల మత్తులో మౌనమా? విచారణతోనే స్పష్టత.
మట్టి తరలింపు వ్యవహారంలో కొందరు అధికారులు పట్టించుకోవడం లేదని దీని వెనుక మామూళ్ల వ్యవహారం ఉండవచ్చని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటివరకు నిర్ధారిత ఆధారాలు వెల్లడికాలేదు. అందువల్ల ఆరోపణల్లో వాస్తవమెంత?ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించారా? అధికా రుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా?
అన్నది నిష్పక్షపాత విచారణలో తేలాల్సి ఉంది.ఈ నేప థ్యంలో తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించి అనుమతుల రికార్డులను తనిఖీ చేసి మట్టి తరలిస్తున్న వాహనాల వివరాలను సేకరించాలని ప్రజలు కోరుతు న్నారు.
కలెక్టర్ జోక్యం చేసుకుంటారా? మైనింగ్ మంత్రి స్పందిస్తారా?
జిల్లా కేంద్రానికి సమీపంలో గుట్టల తవ్వకాల ఆరోపణలు జమ్మిచేడు రోడ్డులో మట్టి తరలింపు వ్యవహారంపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.మైనింగ్, రెవెన్యూ తదితర సం బంధిత శాఖల అధికారులతో సంయుక్త విచారణ జరిపించి అనుమతుల వివరాలను ప్రజలకు వెల్లడించాలని కోరుతున్నారు.
అలాగే మైనింగ్ మంత్రి ఈ వ్యవహారంపై దృష్టి సారించి అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.మైనింగ్ శాఖ అనుమతులు ఇవ్వలేదంటోంది, రెవెన్యూ శాఖ కూడా తమ కార్యాలయం నుంచి అనుమతులు మంజూరు కాలేదంటోంది,పోలీసు శాఖ ఇది మైనింగ్ శాఖ పరిధిలోని అంశమని చెబుతోంది,
మరి గుట్టలను తవ్వు తున్నదెవరు? మట్టిని తరలిస్తున్నదెవరు? నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నాయా?ఈ ప్రశ్నలకు జిల్లా యంత్రాంగం సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.
అధికారుల ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి విచారణతో వాస్తవాలను వెలికితీసి, ప్రకృతి సంపద పరిరక్షణకు చర్యలు తీసుకుంటారా? అన్నది వేచి చూడాలి.