మనస్థాపంతో యువకుడు ఉరివేసుకొని మృతి

25-09-2026 | 07:56pm

నాగిరెడ్డిపేట్,సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి): మనస్థాపనతో యువకుడు ఉరి(Young man hangs himself) వేసుకొని మృతి చెందిన ఘటన చిన్న ఆత్మకూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్(SI Bhargav Goud) తెలిపిన వివరాల ప్రకారం...మండలంలోని చిన్న ఆత్మకూర్ గ్రామానికి చెందిన సంధిల భాను ప్రకాష్(Bhanu Prakash) (21) సంవత్సరాలు. మృతుడు సంధిల భాను ప్రకాష్ సెప్టెంబర్ 7వ తేదీన వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం భార్య వైవాహిక జీవితం కొనసాగించేందుకు ఇష్టం లేదని చెప్పడంతో భాను ప్రకాష్ మనస్థాపానికి గురైనట్లు తెలుస్తుంది.

ఇంటి నుండి బయటకు వెళ్లిన సంధిల భాను ప్రకాష్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా వ్యవసాయ పొలంలోని చిన్న గుడిసెలో ఉరి వేసుకున్న స్థితిలో మృతి దేహం కనిపించిందని ఎస్ఐ.భార్గవ్ గౌడ్ తెలిపారు.సమాచారం అందుకున్న నాగిరెడ్డిపేట్ మండల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మృతుడు తండ్రి సంధిల పోచయ్య ఎవరిపైన ఎటువంటి అనుమానం లేదని తెలిపినట్లు ఎస్ఐ భార్గవ్ గౌడ్ తెలిపారు.

మరిన్ని వార్తలు