భవిత కేంద్రం వద్ద గంజాయి కలకలం

10-09-2026 | 11:10am

బోధన్ సెప్టెంబర్ 10 (విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని ఎంఈఓ ఆఫీస్ వెనకాల గల భవిత కార్యాలయంలో వద్ద గంజాయి సేవిస్తున్నట్లు ఎంఈఓ ఆఫీస్(Bodhan MEO office) సిబ్బంది విజయక్రాంతి రిపోర్టర్ కు ఫోన్ చేసి సమాచారం అందిచగా అక్కడికి వెళ్లి ఈ ఫోటోలు తియ్యగా గంజాయి సేవిస్తున్న నలుగురు పారిపోయారు. భవిత విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది పేర్కొన్నారు. ఇటువైపు తెలంగాణ ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నప్పటికీ భవిత కేంద్రం వద్ద గంజాయి సేవించడం సరైన పద్ధతి కాదని స్థానికుల ఆరోపిస్తున్నారు. గంజాయి బ్యాచ్ పై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఎంఈఓ ఆఫీస్ కార్యాలయ సిబ్బంది  కోరారు. 

మరిన్ని వార్తలు