జర భద్రం.. కల్లులో డ్రగ్స్.. నలుగురికి పాజిటివ్
కల్లు దుకాణాల్లో ఈగల్ టీం తనిఖీలు.. నలుగురికి డ్రగ్స్ పాజిటివ్
తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్ లోని కల్లు దుకాణాల్లో ఈగిల్ టీమ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. తెలంగాణ ఈగిల్ ఫోర్స్(Telangana Eagle Force) దాడుల్లో నలుగురికి డ్రగ్స్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కల్లు డిపో యజమాని, మేనేజర్ పరారీలో ఉన్నారని, 45 బాక్సుల కల్లు సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం(Government of Telangana) డ్రగ్స్, మత్తు పదార్థాలపై ప్రత్యేక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.
ఎవరైనా మత్తు, పదార్ధాలు అమ్మిన, కొన్న కఠిన శిక్షలు విధిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. పొద్దంత కూలీ పనులు చేసి అలసిపోయి నోళ్లు సాయంత్రం ఒక సీసా కల్లు తాగితే మంచిగా నిద్ర పడుతుందని కల్లుకు బానిసైపోతారు. ఇదే అదునుగా తీసుకున్న కల్లు కంపౌండ్ నిర్వహకులు మత్తు పదార్థలు కలిపి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కల్లు డిపోలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.