ఎల్బీనగర్‌లో రోడ్డుప్రమాదం... కారు డోర్లు లాక్

10-09-2026 | 09:11am

హైదరాబాద్: ఎల్బీనగర్‌(LB Nagar) చింతలకుంట వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి విజయవాడ ఆర్టీసీ బస్సును(Vijayawada RTC bus) వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. డోర్లు లాక్ కావడంతో కారులోని వ్యక్తులు ఆందోళనకు గురయ్యారు. తక్షణమే అప్రమత్తమైన స్థానికులు బాధితులను బయటకు తీశారు. ఓ నాయకుడి పుట్టినరోజు వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు