బయట బీఆర్ఎస్.. సభలోపల బీజేపీ రచ్చ.. సమయం వృథా
రెండు పార్టీలు కుయుక్తులు పన్ని సభలో అలజడి
ఆది శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Adi Srinivas Comments ) కీలక వ్యాఖ్యలు చేశారు. బయట బీఆర్ఎస్.. సభ లోపల బీజేపీ(Bharatiya Janata Party) రచ్చ చేస్తోందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రెండు పార్టీలు సభ సమయాన్ని వృథా చేసే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజాసమస్యలపై చర్యలు జరిపి పరిష్కారాలు కనుగొనాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. సమస్యలపై చర్చలు జరిపితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రెండు పార్టీలు కుయుక్తులు పన్ని సభలో అలజడి సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇప్పటికే 3 రోజులు వృథా.. ప్రజా సమస్యల కంటే ఫక్తు రాజకీయాలు చేసేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్(Speaker Gaddam Prasad) పై జరిగిన అమమాననంపై చర్చ జరపాలంటే బీఆర్ఎస్ చర్చించదన్నారు. 22ఏ చర్చ జరపాలంటే సభలో గందరగోళం సృష్టించేందుకు బీజేపీ యత్నిస్తోందని తెలిపారు. ప్రతి ప్రజా సమస్యపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్(Government Whip Adi Srinivas) వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా సభను నడిపేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఘటనలను ఏఐ కంటెంట్ ,ఫేక్ అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.