విద్యార్థుల సృజన ‘ప్రేమాక్షరి’

19-10-2026 | 05:05am

అంతర్గతంగా పెల్లుబికే భావవ్యక్తీకరణకు స్పష్టమైన అక్షరాకృతిని పొదగడం సృజనాత్మక నైపుణ్యమనే (Creative skills)చెప్పాలి. సామాజికతతో కూడిన విషయ అవగాహన కలిగి, ఎడిటింగ్ పద్ధతులు తెలిసి, ఆలోచింపజేసే శైలితో రచనలు చేసే రచయితల ’చేరాతలకు’ ఆదరణ కూడా అధికంగానే ఉంటుంది. ఏం, ఎలా, ఎంత, ఎవరికోసం రాయాలో స్పష్టంగా తెలిసి రాసిన విద్యార్థుల రచనల కదంబమే ప్రే మాక్షరి సంకలనం. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖ విద్యార్థుల రచనలతో ఈ సంకలనం వెలువడింది.

ఈ సంకలనానికి జర్నలిజం శాఖ కు చెందిన విద్యార్థి కొండూరి కోటి బాబు సంపాదకులుగా ఎస్.కళ్యాణ్‌దాస్, ఎన్. అంజనేయులు (అంజిబాబు) సహ సంపాదకులుగా వ్యవహరించారు. ఒక భావానికి అక్షర రూపం తొడిగి సమంజసమైన వ్యక్తీకరణతో ఆమోదయోగ్యతను పొందడం సులువైన విషయమేమీ కాదు. ఈ సంకలనంలోని విద్యార్థుల రచనలు విషయ నిష్ట తతో పాటు పరిశోధనాత్మకంగా కనిపిస్తాయి. జర్నలిజం విభాగపు విద్యార్థులు రాసిన వ్యాసాలు కనుక ఎడిటింగ్ పద్ధతుల ప్రమాణాత్మకత కూడా పాటించే కృషిని కూడా చేశారనడంలో సందేహం లేదు.

చాట్ జీపీటీ, కృత్రిమ మేధస్సు వంటి అత్యాధునిక సాంకేతికత విస్తృతంగా అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో జ్ఞానాభిలాషతో తమ సృజనాత్మకమైన రచనలతో పుస్తకాన్ని తీసుకువచ్చేందుకు జర్నలిజం విద్యార్థులు చేసిన ఈ ప్రయ త్నం అభినందనీయం. భాషపై ప్రేమ, భా వవ్యక్తీకరణలో సృజనాత్మకతను ప్రదర్శిం చి విద్యార్థులు తమ స్వీయ రచనా ప్రతిభ ను ఈ పుస్తకంలో అద్భుతంగా చాటారు.

సాధారణంగా పుస్తకాల్లో కనిపించే విషయ సూచికను ఈ పుస్తకంలో సరికొత్తగా ‘ప్రేమాక్షరులు’ అన్న శీర్షికతో నిర్ణయించి వరుస క్రమాన్ని తెలిపారు. మొత్తం 36 మంది విద్యార్థుల రచనలు ఇందులో ఉన్నాయి. వ్యాసాలు, కథనాలు, కథలు, అభిప్రాయాలను ఈ సంపుటిలో చేర్చారు. సంకలనంలోని తొలి కవిత ‘ప్రేమాక్షరి కవ్వింపు’లో కవి కొండూరు కోటి బాబు ప్రతి ఒక్కరూ తమ జీవనానుభవానికి వచ్చిన విషయాన్ని కవిత, పాట, వార్తగా మలచి హృదయాక్షరాలను ప్రపంచానికి పంచుదామన్నారు.

‘నా మనసులో నీ ప్రేమెంత’, ‘ఆయుష్షును పెంచుకుం టూ’ అన్న తన మరో రెండు కవితల ద్వారా కోటిబాబు ప్రేమ ఉన్నతీకరణను తెలిపి, లవ్ ఫెయిల్యూర్ మరణాలకు స్వస్తి పలకాలన్న సందేశాన్ని అందించారు. నర్సప్ప కురవ తమ కవిత ‘నీ కళ్లలోకి నేను చూసిన క్షణం’లో హృదయ వేగం పెరిగితే అది ప్రేమాంగీకారానికి సంకేతమని చెప్పా రు. నాగుల ఆంజనేయులు (అంజి బాబు) రాసిన ‘అమ్మాయిలు జాగ్రత్త’ వ్యాసం పెళ్లి కి ముందు అబ్బాయిల గురించి తెలుసుకోవలసిన పలు అంశాలను వివరించింది.

ప్రకృతి ప్రేమ గొప్పతనాన్ని కుడా ఈ వ్యా సం ఉదాహరించి విశ్వప్రేమను నిర్వచించింది. ‘మోయలేని భారం రాయలేని కావ్యమే ప్రేమ’ అన్న కొత్త ప్రశాంత్ వ్యాసం ఒక అనిర్వచనీయమైన భావంగా ప్రేమను తెలిపి అందులోని భిన్న దృక్కోణాలను విశ్లేషణాత్మకంగా, పరిశోధనాత్మక సమాచారంతో అందించింది. ‘వలస కాటు’ శీర్షికతో పాలమూరు జిల్లా వలసల నేపథ్యంలో కొండూరు కోటి బాబు రాసిన మానవీయ కథనం గ్రామీణ సామాజిక వ్యవస్థలోని అసమానతల ప్రతిఫలనాలను  చూపి కంటతడి పెట్టించింది. నాగుల ఆంజనేయులు (అంజిబాబు) రాసిన ‘నా చెలి పాడే మధురమైన సంగీతం’ విచిత్రానుభూ తుల్ని తట్టి లేపుతుంది.  

జి.అశోక్ కుమార్ అందించిన తెలుగు వర్ణమాల అక్షరా లన్నింటితో ‘తెలుగు వర్ణమాలతో పెళ్లికి ఆహ్వానం’ పేరిట చేసిన రచన ఎంతో ఆసక్తికరంగా సా గింది. ‘అ’ నుంచి ’ఆ’ వరకు వైవిధ్య, చమత్కారయుత వివరణ ఇస్తూ ఆకట్టుకునేలా చేసిన ఈ ప్రయత్నం ప్రశంసనీయం. ఎస్.ఏసుదాసు (కళ్యాణ్) రాసిన ‘ప్రేమ పై ప్రేమ కురిపించుమా ‘కవిత, ‘ఆ ప్రేమలో ప్రేమెంత’ అన్న వ్యాసం ప్రేమలోని నిజాయితీని తెలిపింది. వై.శ్రీధర్ రాసిన ‘ప్రేమ పెళ్లి’ అన్న శీర్షిక భాగస్వామిని ఎంచుకోవడంలో వ్యక్తిగత స్వేచ్ఛ, నిర్ణయ అధికారం గురించి తెలిపింది.

డాక్టర్ నవీన్ వజ్ర ‘ప్రేమ పేరు ప్రేమే’ అం టూ జన్మలెన్ని మా రినా ప్రేమ శాశ్వతం అన్నారు. ‘ఈ జీవితంలో అసలైన తోడు ఎవరు?’ అన్న కవితలో నవీన్ మంచి ఆలోచనలు మంచి పనులు మనిషికి తోడొచ్చే కీర్తి సౌధాలు అని చెప్పారు. వైద్య వెంకటేశ్వర్లు ‘హృదయం ఒక విశ్వం అయితే’ ప్రేమ విశ్వాంతరాలకు విస్తరిస్తుందని చెప్పారు. వరుణ్ ‘ప్రేమ లాక్ డౌన్’, జి రమేష్ నాయుడు ‘ప్రేమ.. విజయం’ కథనాలు ఆసక్తికరంగా ఆసాంతం చదివేలా సాగాయి. ‘నా జీవితానికి అర్థం నువ్వు’ అంటూ ‘లైను వేసా’ కవితను ఎన్.పవన్‌కుమార్ రాశారు.

ప్రకృతి అం దించిన అనుభూతిని ‘చిరుజల్లుతో లీల మనసు’ అన్న శీర్షికతో చీకూరి లీలావతి అద్భుతంగా అక్షరీకరించారు. ‘నువ్వు చేరిన గమ్యానికి పునాది నేనే ’ అని గుర్తుంచుకోమంటూ జి శివకుమార్ రాసిన ‘నేను అ నుకున్నా’ కవిత లోతుగా ఆలోచింపజేస్తుంది. వై.నదియ రాసిన ‘నిశ్శబ్ద ప్రేమ’, జె.ప్రవీణ్ రాసిన ‘ఓ మధుర జ్ఞాపకం’, జి.శివకుమార్ ‘నాకేం తెలుసు’, కె.రవికుమార్ రాసిన ‘వీడని నీడలా’, ఎన్.లవణ్ కుమార్ ‘అంతర్యుద్ధం’, కొత్తపల్లి శ్రీనివాస్ (వాసు) ‘ప్రేమంటే ప్రియుడు ప్రియురాలేనా’, ప్రేమ స్వరూపాలేనా, సిరిపురం సునేహ ‘ప్రేమ స్వరూపాలే’, పత్యోళ్ళ ప్రభాకర్ ‘ఆశల పల్లకి’, ఏమ్మడి సుధీర్‌కుమార్ రాసిన ‘ఎంత ప్రియమో’ వంటి కవితలు భిన్న వస్తు విశిష్టతను ప్రదర్శించాయి. అంద రూ చదవదగిన జర్నలిజం విద్యార్థుల సృజ నాత్మక రచనల సంకలనమిది.

 వ్యాసకర్త సెల్: (9441464764)


మరిన్ని వార్తలు