ఇస్కాన్ లో ఎమ్మెల్యే నాయిని ప్రత్యేక పూజలు
హనుమకొండ,(విజయక్రాంతి): శ్రీకృష్ణ జన్మాష్టమి(Sri Krishna Janmashtami) పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి(MLA Nayini Rajender Reddy,), సతీమణి నాయిని నీలిమరెడ్డి పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ములుగు రోడ్డులోని శ్రీకృష్ణ మందిరం (ఇస్కాన్) ను సందర్శించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేసి, స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం వరంగల్‌లోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు.
ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం ప్రజల జీవితాల్లో ఆనందం, శాంతి, సౌభ్రాతృత్వం నింపాలని ఆకాంక్షించారు. భగవంతుని ఆశీస్సులతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






