బాన్సువాడలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
04-09-2026 | 10:30pm
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ, పాత బాన్సువాడ పట్టణంలోని శ్రీ రాధాకృష్ణ స్వామి ఆలయాల్లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు(Sri Krishnashtami Celebrations) ఘనంగా జరిగాయి. పూజా కార్యక్రమాలు భజన కార్యక్రమాలు అన్న ప్రసాద వితరణ ఉట్టి కొట్టే కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. మహిళలు పిల్లలు శ్రీకృష్ణ వేషధారణలు(Lord Krishna costumes) గోపిక వేషధారణలో అందరిని అలరించాయి. యాదవ సంఘం కుల పెద్దలు మట్ట సాయిలు, వెంకటి, గొల్ల శ్రీనివాస్ గంగారం, భూమయ్య, తేలే ఉమా మహేష్, భజన మండలి,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.






