హామీలు అమలు చేయాలి.. గ్యారంటీలు నెరవేర్చాలి!

07-09-2026 | 07:05pm

ప్రజావాణిలో బీఆర్‌ఎస్ గర్జన.. కాప్రా, ఉప్పల్ మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నా

ఉప్పల్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు ప్రజావాణి కార్యక్రమం(Prajavani program)లో గళమెత్తారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(Uppal MLA Bandari Lakshma Reddy) ఆదేశాల మేరకు కాప్రా, ఉప్పల్ మున్సిపల్(Uppal Municipal) కార్యాలయాల్లో సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పటికీ అనేక హామీలను నెరవేర్చకుండా ప్రజలను నిరాశకు గురిచేస్తోందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్(BRS) ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు